కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డిని గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడలోని ఓ బంకెట్ హా ల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లలో చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేశామని తెలిపారు. డీఎస్సీ వేశామని, ఇప్పటివరకు 55 వేల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించి, పని చేయాలని సూచించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ రాజు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment