బైలకుప్పే సందర్శన
కరీంనగర్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ రెండ్రోజుల పర్యటనలో భాగంగా కర్నాటకలోని మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పేను సందర్శించారు. టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలు సుకునేందుకు బైలకుప్పేకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బౌద్ద మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జుగ్మే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జుగ్మే సుల్ట్రాన్, జిల్లా మైనారిటీ అధికారి శిల్ప, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గోల్డెన్ టెంపుల్, పద్మ సంభవ, బుద్ధ, అమితాయుస్‌ల ఎత్తయిన (40 అడుగుల) భవ్య విగ్రహాలను, ఫిలాసఫీ యూనివర్శిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డెజ్ హోంను సందర్శించారు. శుక్రవారం ఉద యం బండి సంజయ్ 14వ బౌద్ద మతగురువు దలైలామాతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment