
● అమెరికా ఆంక్షలపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● పార్ట్‌టైం
ముస్తాబాద్(సిరిసిల్ల): అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలన్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు చల్లింది. అమెరికా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అమెరికా వెళ్లి ఎంఎస్ చేసిన విద్యార్థులే కాదు, బీటెక్ చేసి అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలనుకునే విద్యార్థులు ట్రంప్ ఆంక్షలతో ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. పార్ట్‌టైం జాబ్ చేస్తూ ఎంఎస్ చదవాలనే వారికి ఇక ఎంతమాత్రం అవకాశం ఇచ్చేది లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో జిల్లా నుంచి వెళ్లిన చాలా మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఓపీటీపైనే ఆశలు
అమెరికాలో ఎంఎస్ పీజీ చేసే విద్యార్థులు తాత్కాలిక ఉద్యోగాల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) చేస్తారు. శిక్షణ కోసం అమెరికా రాయబార కార్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసిన వారు తమ పేర్లను నమోదు చేసుకుంటారు. వారి సంఖ్య కూడా గతేడాది కంటే ఎక్కువగా నమోదు కావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఎంఎస్ కోసం నా లుగేళ్లు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. రెండేళ్లలో కోర్సు పూర్తి చేస్తే.. మరో రెండేళ్లలో ఉద్యోగం సాధించుకోవచ్చు. అయితే ఉద్యోగం వచ్చే వరకు పార్ట్‌టైం జాబ్ చేయరాదన్న నిబంధనలు అమలులోకి రావడంతో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో హెచ్–1బీ వీసాలు రావడం కూడా కష్టంగా మారుతుందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇండియాలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)లో అవకాశాలు భారీగా ఉండబోతున్నాయన్న సంకేతాలు విద్యార్థులకు ఊరట కలిగిస్తున్నాయి. అయినా అమెరికా వెళ్లాలన్న మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థుల కలలు నెరవేరేలా కనిపించడం లేదు.
అప్పు చేసి అమెరికాకు..
జిల్లాకు చెందిన విద్యార్థులు అమెరికాలో దాదాపు 500 వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధిక శాతం మంది పీజీ చదివేందుకు వెళ్లిన వారే. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ.. విద్యార్థుల పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్‌ల ప్రశ్నగా మిగిలింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పు చేసి అమెరికాలో ఎమ్మెస్ చదివించేందుకు పంపించారు. ఇలాంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.50లక్షలు వ్యయం చేసే పరిస్థితులు ఉన్నాయని పోతుగల్‌కు చెందిన మాజీ సర్పంచ్ ద్యావతి పండరి తెలిపారు. నెలకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, రెండేళ్లు ఎమ్మెస్ చదివేందుకు అయ్యే ఖర్చులు అదనమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించే సమయంలో మంచి పేరున్న కన్సల్టెన్సీల వద్దకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు.
ఇతను ముస్తాబాద్‌కు చెందిన సాయి. అమెరికాలోని బోస్టన్‌లో ఓ యూనివర్సిటీలో గత ఆగస్టులో ఎంఎస్ పూర్తి చేశాడు. అదే యూనివర్సిటీలో పార్ట్‌టైం జాబ్ చేసి, నెలకు రూ.లక్ష వరకు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జాబ్ సెర్చ్‌లో ఉన్నాడు. ఈక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగాలు చేయరాదనే ఆంక్షలు విధించడంతో సాయి తాను చేస్తున్న పార్ట్‌టైం జాబ్‌ను ఈనెలలోనే కోల్పోయాడు. ప్రస్తుతం ఇంటర్వ్యూలకు వెళ్తున్న సాయికి ఉద్యోగం వస్తే ఇబ్బంది లేదు. లేకపోతే ప్రతీ నెల రూ.లక్ష వరకు తల్లిదండ్రులు పంపించా ల్సిందే. ఇలాంటి పరిస్థితి జిల్లా నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు
మా అబ్బాయి న్యూయార్క్‌లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే ఎమ్మెస్ పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. పార్ట్‌టైం జాబ్‌లపై ఆంక్షలు విధించారని తెలిపాడు. దీంతో ఖర్చులకు ఇంటి నుంచే డబ్బులు పంపిస్తున్నాం. పీఎం మోదీపైనే తల్లిదండ్రులు, విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.
– రమేశ్, ముస్తాబాద్
ఆందోళన చెందవద్దు
అమెరికాలో చదవులకు, ఉద్యోగాలకు ఢోకా లేదు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఇండియాలో ఏఐ రంగంలో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆంక్షలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చనే భావన కూడా ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందకుండా పాజిటివ్‌గా ఉండాలి. పుకార్లు నమ్మొద్దు.
– బి.శ్రీనివాస్‌రెడ్డి, సియాటెల్

● అమెరికా ఆంక్షలపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● పార్ట్‌టైం

● అమెరికా ఆంక్షలపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● పార్ట్‌టైం

● అమెరికా ఆంక్షలపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● పార్ట్‌టైం
Comments
Please login to add a commentAdd a comment