
విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
● డీఎంహెచ్‌వో రజిత
సిరిసిల్ల: జిల్లాలోని బడి పిల్లలకు ఉచితంగా నేత్ర వైద్యపరీక్షలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీస్‌లో శుక్రవారం ఆర్‌బీఎస్‌కే సిబ్బంది, వైద్యాధికారులతో సమీక్షించారు. రజిత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా అందించాలని సూచించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సంపత్ ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ నయీమ జహ పాల్గొన్నారు.
ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చని డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. ‘రాచపుండు సలుపుతోంది’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. మొదటి, రెండు స్టేజీల్లోపే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. జంకుఫుడ్ తీసుకోవద్దని పేర్కొన్నారు. పాడయిన, మాడిపోయిన ఆహారం తింటే క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
గోదావరి జలాలకు హారతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట నుంచి 9వ ప్యాకేజీకి నీటిని విడుదల చేయగా.. కాంగ్రెస్ నాయకులు శుక్రవారం హారతి ఇచ్చి, పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ తొమ్మిదో ప్యాకేజీ కెనాల్ ద్వారా మల్కపేట రిజర్వాయర్ నుంచి మూడు రోజులుగా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. బాకూర్‌పల్లితండా వరకు చేరుకున్న ఈ నీటిని రైతులు వ్యవసాయ పొలాలకు వినియోగించుకొని పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసీ చైర్‌పర్సన్ సాబేర బేగం, వైస్‌చైర్మన్ గుండాటి రామ్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, బండారి బాల్‌రెడ్డి, రొడ్డ రామచంద్రం పాల్గొన్నారు.
దేవునిగుట్టతండాకు చేరిన మల్కపేట నీరు
ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీరు అందడంపై గిరిజన రైతులు సంబరాలు జరుపుకున్నారు. నిన్నటి వరకు సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దేవునిగుట్టతండాలో గిరిజన రైతులు ఎండిన పొలాల్లో మేకలను తిప్పారు. ఈ నేపథ్యంలోనే మల్కపేట నుంచి నీరంది మళ్లీ పంటలకు జీవకళ రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఎల్‌ఎండీకి 2500 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ఎడమకాలువకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 196 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 19.64 టీఎంసీలకు చేరింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతం చేద్దాం
వేములవాడ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు కోరారు. వేములవాడలోని తన స్వగృహంలో శుక్రవారం వృక్షార్చన పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాటిన మొక్కలతో సెల్ఫీ దిగి 90003 65000కు వాట్సాప్ చేయాలని కోరారు.

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment