
వడగాల్పులపై అవగాహన కల్పించాలి
● జిల్లాలో ‘సమ్మర్ హీట్ వేవ్’ కమిటీలు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో వడగాల్పులతో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని, ‘సమ్మర్ హీట్ వేవ్’ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. మార్చి నుంచి జూలై వరకు అవసరమైన మేరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. వేసవిలో జాగ్రత్తలు వివరిస్తూ ప్రచారబోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధికారుల సోషల్ మీడియా ద్వారా ఎండ వేడిమి నుంచి సంరక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలన్నారు. ఉపాధిహామీ పనుల సమయాన్ని మార్పు చేయాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా పౌరసంబంధాల అధికారి వి.శ్రీధర్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఈఈటీలో విద్యార్థుల పేర్లు
నమోదు చేయండి
డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ)లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డీఈఈటీ యాప్‌పై అధికారులతో సమీక్షించారు. డీఈఈటీలో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్‌రంగంలోని ఉద్యోగావవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలోని ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణులైన వారి వివరాలు 15 రోజులలో నమోదయ్యేలా చూడాలన్నారు. పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, ఏడీ భారతి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే
10 జీపీఏ సాధ్యం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులు ప్రతీ సబ్జెక్టులోని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని.. తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందవచ్చని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ బాలి కల గురుకుల పాఠశాలను శుక్రవారం తనిఖీ చే శారు. వంటగది, స్టోర్‌రూమ్‌లో నిల్వచేసిన బి య్యం, ఇతర ఆహార పదార్థాల తయారీకి సిద్ధం చేసిన సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతీ తరగతి గదిలోని వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. మ్యాథ్స్, బాటనీ పాఠాలను విద్యార్థినులకు బోధించి వారి సందేహాలను నివృత్తి చేసి వార్షిక పరీక్షలలో 10 జీపీఏ సాధించాలని ఉత్తేజా న్ని నింపారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణ, పరిసరాలు శుభ్రం చేయించాలని అధి కారులను ఆదేశించారు. ప్రిన్సిపాల్ దర్శనాల పద్మ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment