
సంజీవయ్య జీవితం ఆదర్శం
● జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్ ● ఘనంగా సంజీవయ్య జయంతి
సిరిసిల్లటౌన్: అట్టడుగు వర్గాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దామోదరం సంజీవయ్య భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. సంజీవయ్య జయంతిని పురస్కరించుకొని స్థానిక పాతబస్టాండ్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సంజీవయ్యనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు రాగుల జగన్, జక్కుల యాదగిరి, రాగుల రాములు, పాటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment