
ఫీజు బకాయిలు విడుదల చేయండి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కల్యాణ్, మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా విఫలమైందని, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేష్, కుమార్, అజయ్, నిఖిల్, సమీర్, సంజయ్ ,శివశంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment