సిరిసిల్ల: మేలుకో యువతరమా.. అంటూ సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్లాష్‌మాబ్ నిర్వహించారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు.. యువతరం చెడు వ్యసనాలు మానుకోవాలని సందేశాన్నిస్తూ ప్రదర్శన చేశారు. యువత చెడు వ్యసనాలకు వైపు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అంబేడ్కర్ చౌరస్తాలో మెడికల్ కాలేజీ విధ్యార్థులు హఠాత్తుగా వచ్చి పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండడంతో అక్కడ ఉన్న వారు అవాక్కయ్యారు. డ్యాన్స్ చేస్తూ మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలను వివరించడం ఆకట్టుకుంది. సిరిసిల్ల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరింటెంండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ కె.కృష్ణ, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, ట్రాఫిక్ ఎస్సై రమేశ్, ఎంబీబీఎస్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పాల్గొన్నారు.
మేలుకో యువతరమా..
ఫ్లాష్‌మాబ్
Comments
Please login to add a commentAdd a comment