
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
చందుర్తి(వేములవాడ): సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం చందుర్తి సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఏఎస్పీ మా ట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ప్ర మాదాలు, దొంగతనాలలో నిందితులను గు ర్తించవచ్చన్నారు. ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే నేరాలు అరికట్టవచ్చని తెలిపారు. ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్‌కుమార్, కార్యదర్శి కవిత, గ్రామస్తులు హరిబాబు, ఇందూరి మధు, బాల్‌రెడ్డి, జనార్దన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment