![పౌష్ట](/styles/webp/s3/article_images/2025/02/15/16022025-rsd_tab-07_subgroupimage_282914304_mr-1739644124-0.jpg.webp?itok=1sZrvuMI)
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● డీఆర్‌డీవో శేషాద్రి
సిరిసిల్ల: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని డీఆర్‌డీవో శేషాద్రి కోరారు. జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యులకు శనివారం రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్‌డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో వెయ్యి రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. పెరటి తోటల్లో ఆకుకూరలు, కూరగాయలు, కోళ్లు పెంచుకునేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు మంచి ఆహారం తినేలా చూడాలన్నారు. అడిషనల్ డీఆర్‌డీవో గొట్టె శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, డీపీఎంలు పద్మయ్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు
● గృహ నిర్మాణశాఖ పీడీ చిన్నయ్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటలోని మండల పరిషత్ ఆఫీస్ వెనుక రూ.5లక్షలతోనే మోడల్ ఇంటిని నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ పీడీ చిన్నయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం శనివారం స్థలాన్ని పరిశీలించారు. చిన్నయ్య మాట్లాడుతూ ఇంజినీర్లతో మాట్లాడి స్లాబ్ వేసే విషయంలో పలు మార్పులు తెచ్చామన్నారు. రూ.5లక్షల్లోపే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. గృహనిర్మాణశాఖ డీఈ భాస్కర్, ఏఈ హమీద్, ఏఎంసీ వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు ఎస్‌కే గౌస్, చెన్నిబాబు, రాజు, లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
శాశ్వత పనులపై ప్రణాళికలు
● ఈవో వినోద్‌రెడ్డి
వేములవాడ: రాజన్న ఆలయంలో ఏటా అవే పనులు చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘శాశ్వత పనులపై పట్టింపేది’ కథనానికి ఆలయ ఈవో వినోద్‌రెడ్డి స్పందించారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వీటీడీఏ ద్వారా మాస్టర్‌ప్లాన్ తయారు చేసిందని తెలిపారు. ఆలయ విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. అయితే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు తాత్కాళిక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. శాశ్వత పనులు అంచెలంచెలుగా చేపడతామని తెలిపారు.
ఆటో కార్మికులకు పోలీస్‌శాఖ ‘అభయ్ ఇన్సూరెన్స్’
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆటో కార్మికుల భద్రత కోసం పోలీస్‌శాఖ ‘అభయ్ ఇన్సూరెన్స్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గంభీరావుపేటలోని ఆటో కార్మికులకు ఎస్సై శ్రీకాంత్ శనివారం బీమాపత్రాలను అందించారు. ఆటోడ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇబాదుల్లాఖాన్, ఉపాధ్యక్షుడు గుడికాడి మహేశ్‌యాదవ్, కార్యదర్శి శంకర్, ముజీబ్, స్వామి, రాజారాం, భూమయ్య, రమేశ్, బాలభూదయ్య, రవినాయక్, చంద్రం పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో గ్రామస్తులు శనివారం ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు కనగర్తి మూలవాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో కనగర్తి, ధర్మారం, నిజామాబాద్, సుద్దాల, పల్లిమక్త, నాగారం గ్రామాలకు చెందిన సుమారు 80 ట్రాక్టర్లు ఇసుక కోసం వచ్చాయి. ట్రాక్టర్లన్నీ ఒ క్కసారిగా రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నా రు. ఇసుక తవ్వకాలతో వాగులో ఉన్న తాగునీటి బావికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు.
![పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం1](/gallery_images/2025/02/15/16022025-rsd_tab-07_subgroupimage_1888055072_mr-1739644124-1.jpg)
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
![పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం2](/gallery_images/2025/02/15/15srl10-180076_mr-1739644124-2.jpg)
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
![పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం3](/gallery_images/2025/02/15/15vmd52-180057_mr-1739644124-3.jpg)
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
![పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం4](/gallery_images/2025/02/15/16022025-rsd_tab-07_subgroupimage_282928544_mr-1739644124-4.jpg)
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment