
రోడ్డునపడిన కుటుంబం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన చల్ల సమ్మయ్య, కోమల దంపతులకు కూతురు, కొడుకు శివసాగర్ ఉన్నారు. తండ్రి మూగవాడు కావడంతో తల్లి కోమలతో కలిసి శివసాగర్ వ్యవసాయం చేసేవాడు. వీరికి 20 గుంటల భూమి ఉండగా మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. పత్తి, వరిసాగు పెట్టుబడికి రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై గతేడాది నవంబర్ 24న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. 20 గుంటల భూమి సమ్మయ్య పేరున ఉండడంతో శివసాగర్‌కు రైతుబీమా వర్తించలేదు. సమ్మయ్య బిజిగిరిషరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు.

రోడ్డునపడిన కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment