
పంటలను కాపాడుతాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పంటలను కాపాడేందుకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని అ ల్మాస్‌పూర్ సమీపంలోని 9వ ప్యాకేజీ కాల్వను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. మల్క పేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజీ కెనాల్ ద్వారా బాకూర్‌పల్లితండా వరకు సాగునీరందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి తి మ్మాపూర్‌లోని మైసమ్మచెరువు వరకు నీటిని తీసుకెళ్లి పొలాలకు అందిస్తామన్నారు. 9వ ప్యాకేజీ కాల్వలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే నీరు వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. వచ్చే ఏడాదిలో మల్కపేట నుంచి ఎగువమానేరుకు నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ సాబేర బేగం, వైస్‌చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్స య్య, బండారి బాల్‌రెడ్డి, షేక్ గౌస్ పాల్గొన్నారు.
రోడ్డు కోసం నిరసన
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్–దుబ్బాక రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై ముస్తాబాద్‌లో కేటీఆర్ సేన నాయకులు ఆదివారం నిరస న తెలిపారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. మనోహర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్తాబాద్ నుంచి మోహినికుంట వరకు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.24కోట్లు కేటీఆర్ మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పనులు రద్దు చేసిందన్నారు. శీలం స్వామి, వంగూరి దిలీప్, జహంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, నరేంద్రచారి, సతీశ్, మనీశ్, వసంత్, శ్రావణ్, శ్రీకాంత్, మహేశ్, వెంకటేశ్, అశోక్, దేవేందర్, రాజు, శ్రీను పాల్గొన్నారు.
కరాటేలో బాలికలకు బంగారు పతకాలు
కోనరావుపేట(వేములవాడ): రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి బాలికలు బంగారు పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్ కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో కోనరావుపేట మండలం బావుసాయిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నలుగురు బాలికలు బంగారు పతకాలు సాధించినట్లు ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇన్‌స్ట్రక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సీనియర్ కటాలో భూక్య గంగాదేవి గోల్డ్ మెడల్, ఎస్‌కే సల్మా గోల్డ్, జూనియర్ కటాలో జంగం శివాని గోల్డ్, హర్షిణి గోల్డ్ పతకాలు సాధించారు. వీరిని హెచ్‌ఎం చంద్రశేఖర్, కరాటే ఇన్‌స్ట్రక్టర్ శ్రీని వాస్, ఉపాధ్యాయులు అభినందించారు.

పంటలను కాపాడుతాం
Comments
Please login to add a commentAdd a comment