
కేసీఆర్‌నగర్‌లో ఆకస్మిక సర్వే
● పోలీస్, పంచాయతీరాజ్ సంయుక్త ఆపరేషన్ ● భారీగా మోహరించిన పోలీసులు, కార్యదర్శులు ● అరగంటలో సర్వేపూర్తి ● ఇళ్లలో లేనివారికి డోర్‌లాక్ నమోదు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి డబుల్ బెడ్‌రూం సముదాయం(కేసీఆర్‌నగర్ కాలనీ)లో ఆదివారం ఆకస్మికంగా ఇంటింటి సర్వే చేపట్టారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అనర్హులను ఏరివేసేందుకు ఈ ఆకస్మిక సర్వే నిర్వహించినట్లు తెలు స్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకే సిరిసిల్ల ని యోజకవర్గ పరిధిలోని వందకు పైగా పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్‌లో ఆర్డీవో రాధాబాయి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. కేసీఆర్‌నగర్‌లో ఇంటింటి సర్వే చేస్తున్నామని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. ఒక్కో కార్యదర్శికి 10 నుంచి 15 ఇళ్లు మాత్రమే కేటాయించారు. అనంతరం అందరూ ఒకేసారిగా కేసీఆర్‌నగర్ కాలనీకి చేరుకున్నారు. అప్పటికే జిల్లా పోలీసులు వంద మంది వరకు కాలనీని చుట్టుముట్టేశారు. పంచా యతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇల్లు అమ్ముకున్న వారిని, అద్దెకిచ్చిన వారిని, నివాసం ఉండని వారిని గుర్తించి వారి ఇంటిపట్టా రద్దుచేసి అర్హులకు కేటాయించేందుకు సర్వే చేసినట్లు తెలిసింది. అయితే ఆదివారం శుభకార్యాలున్నాయని, చాలా మంది వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లారని.. ఆ సమయంలో వచ్చి సర్వే చేయడం సరికాదని పేర్కొంటున్నారు.

కేసీఆర్‌నగర్‌లో ఆకస్మిక సర్వే
Comments
Please login to add a commentAdd a comment