
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని చీకోడులోని వడ్డెరకాలనీవాసులు నీటి కోసం ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. కాలనీకి చెందిన శివరాత్రి రాజమణి మాట్లాడుతూ 15 రోజులుగా నల్లాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు విన్నవిస్తే.. వాటర్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేయగా.. అందులో చెత్త, నాచుతో కూడిన నీళ్లు వస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ ఏర్పడిందని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ట్యాంకర్ నీరు బాగులేక, మిషన్ భగీరథ నీరు లీకేజీతో నీరు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వడ్డెరకాలనీకి శాశ్వత నీటి పరిష్కారం చూపాలని మహిళలు కోరారు.
కోతులకు కొండెంగ ఫ్లెక్సీతో చెక్
చందుర్తి(వేములవాడ): పంటలను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన చిలుక శంకర్ తాను సాగు చేసిన వరి పంటకు కోతుల బెడద తీవ్రంగా ఉంది. వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు కొండెంగ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను పొలంలో ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి కోతుల రాక కొంతమేరకు తగ్గిందని రైతు తెలిపాడు.
పంటను కాపాడుకునేందుకు..
ఇల్లంతకుంట(మానకొండూర్): వరిపంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదిరిపోవడంతో బోరుబావులు, వ్యవసాయబావుల్లో నీరు అడుగంటిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రైతు ఉప్పునీటి దేవయ్య తనకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశాడు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. బోరు ఎత్తిపోవడంతో రూ.3లక్షలు వెచ్చించి రెండు రోజుల క్రితం మరో బోరు వేయించాడు.

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఖాళీ బిందెలతో మహిళల నిరసన
Comments
Please login to add a commentAdd a comment