‘భరోసా’తో బాధిత మహిళలకు రక్షణ
సిరిసిల్లక్రైం: బాధిత మహిళలు, బాలికలకు భరోసా కేంద్రం రక్షణగా నిలుస్తుందని ఎస్పీ అఖిల్‌మహాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌కాలనీలోనిభరోసా సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. బాధితులకు సహాయం అందించడం, ఆపదలో ఉన్న వారిని పోలీస్‌స్టేషన్లకు తరలించడం, సురక్షితమైన ప్రాంతంలో చేయూతనందించడం భరోసా కేంద్రాల లక్ష్యమన్నారు. సీఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏవో పద్మ, డీసీఆర్బీ ఎస్‌ఐ జ్యోతి, ఎస్సైలు అశోక్, పృథ్వీధర్‌గౌడ్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, అధికారులు అనంత, స్వభావతి, వెన్నెల, మల్లీశ్వరి, వనిత పాల్గొన్నారు.
● ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment