
గంజాయి నిందితులపై నిఘా పెట్టాలి
సిరిసిల్లక్రైం: జిల్లాలో గంజాయి నివారణకు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పలు కేసుల్లోని నిందితులపై నిఘా తీవ్రం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఠాణాల్లో నమోదైన గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలు గమనిస్తూ స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలన్నారు. గంజాయి కిట్ల సహాయంతో టెస్ట్‌లు చేసి పాజిటివ్‌గా వస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ జంతువులను వేటాడే వారిపై నిఘా కఠినతరం చేయాలని, తరచు జంతువుల వేటకు వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు. కులబహిష్కరణలకు పాల్పడుతే చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు మారుతి, అశోక్, ప్రశాంత్‌రెడ్డి, పృథ్వీధర్‌గౌడ్, ప్రేమానందం, ఐటీ కోర్ ఎస్సై కిరణ్, డీసీఆర్బీ ఎస్సై జ్యోతి పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌డేకు 18 ఫిర్యాదులు
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించి గ్రీవెన్స్ డేలో వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్ తెలిపారు. సివిల్ తగాదాలను పరిష్కరించే సమయంలో చట్ట పరిధిలో సలహాలు ముందుకెళ్లాలని పోలీసులకు సూచించారు.
ఇంటర్నల్ మార్కుల పరిశీలన
ఇల్లంతకుంట: మండలంలోని వల్లంపట్ల, రేపాక, పెద్దలింగాపూర్, వెల్జిపూర్, ఆదర్శ పాఠశాల పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఉపాధ్యాయులు పరిశీలించారు. మండలంలోని గురుకుల, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కుల పరిశీలన సోమవారంతో ముగిసింది. వల్లంపట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు దూస గోవర్ధన్, వెల్జీపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు కే రాజ్ కుమార్, పత్తి వంశీధర్ రెడ్డి, టీ నరేందర్ రెడ్డి, ఐరెడ్డి ప్రదీప్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment