![క్యూల](/styles/webp/s3/article_images/2025/02/18/17srl229-180147_mr-1739817699-0.jpg.webp?itok=nF-nWUYb)
క్యూలైన్ ఏర్పాటు చేయండి
వేములవాడ రాజన్న దర్శనానికి సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలి. సీనియర్ సిటిజన్ భక్తులు వేములవాడ రాజరాజేశ్వరుని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక వేళల్లో దర్శనానికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలి. సాధారణ లైన్‌లో నిల్చొనే అవకాశం ఉండదు.
– సీనియర్ సిటిజన్లు
కాలువ పనులు పూర్తి చేయండి
ఇల్లంతకుంట(మానకొండూర్): అసంపూర్తిగా ఉన్న సాగునీటి కాలువలు పూర్తి చేయాలని ఇల్లంతకుంట మండలానికి చెందిన నాలుగు గ్రామాల రైతులు 50 మంది బైకులపై వెళ్లి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు విన్నవించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 11వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన కాలువ పనులు పూర్తి చేసి పంటలు ఎండిపోకుండా చూడాలని పెద్దలింగాపురం, చిక్కుడువానిపల్లి, రామాజీపేట, వెల్జిపురం గ్రామాల రైతులు కోరారు. పెద్దలింగాపురం వరకు కాలువ నిర్మించి వదిలేశారని, మరో 300 మీటర్ల కాలువ నిర్మిస్తే రంగనాయకసాగర్ నుంచి నీరు వచ్చేదన్నారు. కాల్వ పూర్తి చేయించాలని కోరారు. రైతులు అమ్ముల అశోక్, దేశెట్టి శ్రీనివాస్, పయ్యావుల బాలయ్య, గొడిశెల మల్లేశం, గాదె మధు తదితరులు ఉన్నారు.
![క్యూలైన్ ఏర్పాటు చేయండి 1](/gallery_images/2025/02/18/17srl27-180045_mr-1739817699-1.jpg)
క్యూలైన్ ఏర్పాటు చేయండి
Comments
Please login to add a commentAdd a comment