
అపర భగీరథుడు కేసీఆర్
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లటౌన్: కరువు నేల తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపరభగీరథుడిగా మాజీ సీఎం కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అభివర్ణించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్న వారి మాటలను పటాపంచలు చేస్తూ స్వరాష్ట్రాన్ని సాధించిన ఽధీశాలిగా పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్‌వన్ స్థానంలో ఉంచారని కొనియాడారు. తెలంగాణ భవన్‌లో కేక్ కోసి, మొక్కలు నాటారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ తాజామాజీ చైర్‌పర్సన్ జిందం కళ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, దిడ్డి రాజు, గుండ్లపెల్లి పూర్ణచందర్, సత్తార్, గడ్డం లత, బత్తుల వనజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు పెంచాలి
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు నమ్మకం కల్పించేలా సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి పెంచలయ్య సూచించారు. ఎల్లారెడ్డిపేట సామాజిక ఆస్పత్రి, గంభీరావుపేట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లను సోమవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని మందులు, సిబ్బంది, రోగుల రికార్డులు పరిశీలించారు. వేసవిలో వడదెబ్బతో వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్లు బాబు, ప్రదీప్, ఓంకార్, సూపరింటెండెంటెంట్ డాక్టర్ సృజన్, ఆర్‌ఎంవో సింధూజ పాల్గొన్నారు.

అపర భగీరథుడు కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment