విద్యార్థులకు కంటి పరీక్షలు
సిరిసిల్ల: జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు పరీక్షలు చేశారు. చూపు లోపాలున్న విద్యార్థులకు మందులు అందిస్తారని, మరోసారి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తారని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ ప్రాంతీయ వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ నహిమ, డాక్టర్ కృష్ణవేణి, ఫార్మసిస్ట్‌లు విజయలక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి
సిరిసిల్లటౌన్: టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం సిరిసిల్ల డిపోలో ‘పవర్ ఫుల్ (గొప్ప మార్పునకు శ్రీకారం)’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, చేయి ఎత్తిన చోట ఆపడం, దింపడం, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగుల్లో నూతనోత్తేజం, ప్రయాణికుల పట్ల సానుభూతి, రోడ్ సేఫ్టీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. హర్భజన్‌సింగ్, శ్రీనివాస్, వేణు, రామకృష్ణ, రాంరెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి కోసం రైతుల నిరసన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాగునీటి కోసం మండలంలోని జిల్లెల్ల శివారు నక్కవాగు వద్ద మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లెల్ల చుట్టుపక్కల గ్రామాలకు రావాల్సిన కాలువ నీటిని వేరే గ్రామాల వారు మళ్లించుకుపోతున్నారని ఆరోపించారు. నక్కవాగుకు వచ్చే నీటిని అడ్డుకుంటూ చెక్‌డ్యామ్ నిర్మించడంతో వాగులోకి నీరు రాలేని పరిస్థితి నెలకొందన్నా రు. నక్కవాగులోకి నీరు వస్తేనే వ్యవసాయం చే సుకోవడం వీలవుతుందని, అధికారులు సాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు.
విద్యుత్ అధికారుల తనిఖీ
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు రైస్ మిల్లులను మంగళవారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. మిల్లులకు విద్యుత్ అనుమతి, వినియోగిస్తున్న మోటార్లను పరిశీలించారు. విజిలెన్స్ ఏఈ స్రవంతి, వేములవాడ పట్టణ సెస్ ఏఈ సిద్ధార్థ, లైన్ ఇన్‌స్పెక్టర్ రాజయ్య ఉన్నారు.
సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలి
బోయినపల్లి(చొప్పదండి): పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించి, మాతా శిశు మరణాలు తగ్గించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.రజిత పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి రేణుప్రియాంక, సిబ్బంది తదితరులు ఉన్నారు.
జాతర ఏర్పాట్లు పరిశీలన
వేములవాడఅర్బన్: రాజన్న సన్నిధిలో ఈనెల 25 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆదేశాల మేరకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రాజన్న ఆలయంతో పాటు పరిసరాల ప్రాంతాలను ఆలయ ఈఈ రాజేశ్‌తో కలిసి సందర్శించారు. ఏఈ రామ్‌కిషన్‌రావు, డీఈ మహిపాల్, వేములవాడ టౌన్ ట్రాఫిక్ ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు
విద్యార్థులకు కంటి పరీక్షలు
విద్యార్థులకు కంటి పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment