నేతన్నలపై సర్కారు చిన్నచూపు
సిరిసిల్లటౌన్: నేతన్నలపై సర్కారు చిన్నచూపు చూస్తుందని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ విమర్శించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 1న పాలిస్టర్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, చేనేతజౌళి శాఖ ఏడీ, లేబర్ అధికారి, మ్యాక్స్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవ్వరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఈనెల 24న పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, సబ్బని వెంకటాద్రి, యేన్నం శేఖర్, బొద్దుల అశోక్, యేన్నం సంతోష్, మిట్టపల్లి వెంకటేశం, గడ్డం గణేశ్, సబ్బని బాలరాజు, గోరింటాకు మల్లేశం, బొప్పరాజు కుమారస్వామి, తాటికొండ రమేశ్, నాగుల కనకయ్య, గడ్డం సంజయ్‌కుమార్, కోడం సత్యనారాయణ, గోరింటాల జగదీశ్, రాపేల్లి లక్ష్మణ్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment