కాంగ్రెసోళ్లకు అభివృద్ధి అంటే తెల్వదు
సిరిసిల్లటౌన్: అభివృద్ధి చేసే లక్షణం కాంగ్రెస్ సర్కారుకు ఉండదని, అందుకే ఆపార్టీ నేతలకు బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. కేసీఆర్ అందించిన ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్న సత్యాన్ని కాంగ్రెసోళ్లు జీర్ణించుకోలేక అనేక ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కుంభాల మల్లారెడ్డి, గజభీంకార్ రాజన్న, వెంగళ శ్రీనివాస్, కోడం శంకర్, పోచవేని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment