నేటి ప్రజావాణి రద్దు
సిరిసిల్లటౌన్: జిల్లా సమీకృత కార్యాలయ సముదాయము (కలెక్టరేట్)లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మహాశివరాత్రి జాతర నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్నికలు, జాతర విధుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలన
వేములవాడ: రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆలయ పరిసరాలు, గుడిచెరువు వద్ద మైదానం, శివార్చన స్టేజ్, ధర్మగుండం, క్యూ లైన్లను పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జాతరకు తరలిరానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
బాధ్యతలు చేపట్టిన ఉత్సవ కమిటీ
వేములవాడ: రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియమించింది. ఈమేరకు ఆదివారం 29 మందితో కూడిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకొని బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఈవో వినోద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతర సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అనుముల చంద్రం, వడ్డేపల్లి వెంకటరమణ, కె.రాజిరెడ్డి, సి.విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగ స్వామి, కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపటి రామస్వామి, కాయతి నాగరాజు, తొట్ల అంజయ్య, ఏనుగు రమేశ్‌రెడ్డి, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, ధర్న మల్లేశం, ఒలిమినేని నిత్యానందరావు, గొట్టే ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సుగూరి లక్ష్మి, తోట లహరి పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు సరికాదు
సిరిసిల్లటౌన్: జిల్లాలో కాంగ్రెస్ నేతలు అధికారులతో చేపడుతున్న అక్రమ అరెస్టుల పర్వాన్ని ఆపాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులే కాకుండా ఓట్లేసిన వాళ్లు, తమ నేతల సంబంధీకులు, రైతులపై కక్షసాధింపు ధోరణికి దిగడం ఎంటని ప్రశ్నించారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రధాన నేతల ఆగడాలు సరికాదని, సామాన్యులపై కర్కశంగా ప్రవర్తిస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలపై అవాక్కులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వస్తున్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కులగణన పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్‌బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, ఆకునూరి శంకరయ్య, గుండ్లపెల్లి పూర్ణచందర్, కుంభాల మల్లారెడ్డి, ఎండీ సత్తార్ పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు
Comments
Please login to add a commentAdd a comment