
గుర్తుకొస్తున్నాయి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో గతంలో ముంపునకు గురైన ఇళ్లు, ఇతర నిర్మాణాలు పైకి తేలాయి. నిర్వాసితులు తమ ఇళ్లను చూసి గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. కూలిన ఇళ్లు, పైకప్పులు లేని గోడలను చూసి పలువురు కళ్లు చెమర్చుతున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రాజెక్టులో నీరు అడుగంటుతుండడంతో సమీప గ్రామాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పంటపొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.3 టీఎంసీ నీరు మాత్రమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment