
జిల్లా పంచాయతీ అధికారిగా షర్ఫుద్దీన్
సిరిసిల్ల: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా షర్ఫుద్దీన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హన్మకొండ జిల్లా పరకాల డీఎల్‌పీవోగా పనిచేస్తున్న ఫర్ఫుద్దీన్‌ను పదోన్నతిపై డీపీవోగా నియమించింది. గతంలో సిరిసిల్ల డీపీవోగా ఎ.రవీందర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో డీపీవోగా షర్ఫుద్దీన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను సోమవారం కలిసి విధుల్లో చేరారు.
చెక్‌పోస్టుల ఏర్పాటుతో ఏఎంసీకి ఆదాయం
● పోతుగల్ ఏఎంసీ చైర్‌పర్సన్ రాణి
ముస్తాబాద్(సిరిసిల్ల): మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల ఏర్పాటుతో పోతుగల్ ఏఎంసీకి వచ్చే ఆదాయం పెరుగుతుందని చైర్‌పర్సన్ తలారి రాణి అభిప్రాయపడ్డారు. పోతుగల్ ఏఎంసీ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. రాణి మాట్లాడుతూ ముస్తాబాద్‌లో శాశ్వతంగా చెక్‌పోస్టు ఏర్పాటుకు పంచాయతీ సహకారం తీసుకోవాలని సూచించారు. రైస్‌మిల్లుల యజమానులతో చర్చించి ఫీజులు వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఆవునూర్‌లో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదాం నిర్మాణానికి తీర్మానించారు. వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, డైరెక్టర్లు కొమురయ్య, క్యారం రాజు, శంకర్, ప్రతాప్‌రెడ్డి, బుచ్చయ్య, రాజయ్య, సారగొండ రాంరెడ్డి, యాదగిరిరెడ్డి, మున్నా, కార్యదర్శి హరినాథ్, నిషాంత్ పాల్గొన్నారు.
పల్లె దవాఖానాలో వైద్యసేవలు ప్రారంభం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు పల్లె దవాఖానాకు మార్పిడి చేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి రజిత తెలిపారు. స్థానిక పీహెచ్‌సీని పల్లె దవాఖానాలోకి సోమవారం మార్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ 50 పడకల ఆస్పత్రి సేవలు అమలులోకి వచ్చే వరకు పల్లె దవాఖానాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు అందుతాయని తెలిపారు. పెద్దలింగాపురంలోని పీహెచ్‌సీలో వైద్యసేవలు అందుతాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారులు ప్రేమ్, సంపత్, ఇల్లంతకుంట పీహెచ్‌సీ డాక్టర్ జీవనజ్యోతి, హెచ్‌ఈవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌గా నేహా
సిరిసిల్లటౌన్: జాతీయ పవర్‌లిఫ్టింగ్‌లో సిరిసిల్లకు చెందిన నేహా చాంపియన్‌గా నిలిచారు. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన పవర్‌లిఫ్టింగ్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు. కోచ్‌లు శేఖర్, సత్య, నిఖిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఐఐహెచ్‌టీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు
సిరిసిల్ల: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు జి.రాఘవరావు సోమవారం తెలిపారు. ఐఐహెచ్‌టీలో ఫస్టియర్(2025–2026)లో ప్రవేశానికి 60 సీట్లు ఉన్నాయని వివరించారు. మూడేళ్ల(ఆరు సెమిస్టర్ల) కోర్సులో ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులు, 2025 జూలై 1 నాటికి 23 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్ల వయసు వరకు అనుమతిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 2025 ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. వివరాలకు హిమజకుమార్ 90300 79242లో సంప్రదించాలని సూచించారు.

జిల్లా పంచాయతీ అధికారిగా షర్ఫుద్దీన్

జిల్లా పంచాయతీ అధికారిగా షర్ఫుద్దీన్

జిల్లా పంచాయతీ అధికారిగా షర్ఫుద్దీన్
Comments
Please login to add a commentAdd a comment