ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల: జిల్లాలో అనధికార లే–అవుట్‌ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్–2020లో వచ్చిన దరఖాస్తులను క్రబద్ధీకరించుకోవాలని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు. ఈనెల 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుంలో 25 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 42,942 దరఖాస్తులు రాగా.. 34,229 ప్రాజెస్ అయ్యాయని, మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. 2020లో దరఖాస్తు చేసుకున్న వారు తమ ప్లాటును రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై అనుమానాల నివృత్తికి టోల్‌ఫ్రీ 18002331495 నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
అనధికార లే అవుట్‌ల క్రమబద్ధీకరణకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment