గొలుసుకట్టు చెరువులు నింపండి
ఇల్లంతకుంట(మానకొండూర్): రబీలో వేసిన పంటలు ఎండిపోకుండా గొలుసుకట్టు చెరువుల్లో నీరు నింపాలని ఇంజినీరింగ్ అధికారులకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంట మండల పరిషత్‌లో శనివారం ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నపూర్ణ, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటితో ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి మండలాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపాలని ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అసంపూర్తిగా వదిలిపెట్టిన దాచారం, బోటిమీదిపల్లి, రామాజీపేట, పెద్దలింగాపూర్ గ్రామాల కాల్వ పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అన్నపూర్ణ ప్రాజెక్టు డీఈ దేవేందర్, ఏఈ సమరసేన, రంగనాయకసాగర్ ప్రాజెక్టు డీఈ సీతారామరాజు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్దలింగాపూర్ కాల్వ పనులకు అంచనాలు సిద్ధం చేయండి
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment