9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
వీర్నపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసే వరకు పోరాడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. గత ప్రభుత్వం 9వ ప్యాకేజీ పూర్తి చేయకుండానే 11వ ప్యాకేజీకి నిధులు తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మద్దిమల్లలో 9వ ప్యాకేజీ పనులు పూర్తికాక ఎండిపోయిన రాయినిచెరువును శనివారం పరిశీలించి మాట్లాడారు. రాయినిచెరువు ఎండిపోవడంతో ఆయకట్టు పంటలు ఎండిపోతున్నాయన్నారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి రాయినిచెరువుకు రావలసిన పైపులైన్ పనులను కంచర్ల అటవీ ప్రాంతంలో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాలో పర్యటించిన సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తామన్న హామీని అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. అనంతరం మద్దిమల్ల, రంగంపేటల్లో మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పంబాల దేవరాజు, బీజేపీ వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల అధ్యక్షులు లక్పతినాయక్, పొన్నాల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు పిట్ల నాగరాజు, చందుపట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరో రోజుకు రైతుల రిలే నిరాహార దీక్షలు
ఇల్లంతకుంట(మానకొండూర్): పెద్దలింగాపూర్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం ఆరో రోజుకు చేరాయి. రంగనాయకసాగర్ నుంచి ప్రారంభమైన ఎల్‌ఎం 6 కెనాల్ అసంపూర్తి పనులు పూర్తి చేయాలని రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వ్యవసాయపనులు చూసుకొని ఉదయం 9 గంటల వరకు దీక్ష శిబిరానికి రావడం సాయంత్రం మళ్లీ పొలం వద్దకు వెళ్లి పనులు చూసుకుంటున్నారు. శిబిరంలో పెద్దలింగాపూర్, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, ఎడ్లోనికుంట రైతులు పాల్గొన్నారు.
బ్లూకోల్ట్స్ విధులు నిర్వర్తించిన మహిళా పోలీసులు
బోయినపల్లి(వేములవాడ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక మహిళా పోలీసులు పింకిల్‌యాదవ్, సహన శనివారం బ్లూకోల్ట్స్ విధులు నిర్వర్తించారు. పలు గ్రామాల్లో వారు తిరుగుతూ మహిళలతో మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు.
బీసీ సాధికారత సాధిస్తాం
● జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలయ్య
సిరిసిల్లటౌన్: బీసీ సాధికారిత సాధించే వరకు పోరాడుతామని బీసీ సాధికారత సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య పేర్కొన్నారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీల సాధికారతతోనే వెనుకబడినవర్గాలు రాణిస్తారన్నారు. శాంతినగర్‌లోని కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ జిల్లా, మండల నాయకులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో తీగల శేఖర్‌గౌడ్, గోశిక శ్రీనివాస్, గుజ్జె శివరాం, అన్నారపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment