మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలి
వేములవాడ: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని వేములవాడ జడ్జి జ్యోతిర్మయి కోరా రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోర్టుహాలులో శనివారం మహిళా న్యాయవాదులతో కలిసి కేక్ కట్ చేశారు. జడ్జి మాట్లాడుతూ బాలికలు చదువులపై ఆసక్తి పెంచుకుని అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదన్నారు. మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ, సుజాత, నయీమానాసరి, పద్మ, సరిత, పావని, కోర్టు సిబ్బంది జయ, జగ్మాదాదేవి, జోష్న, కవిత, లత ఉన్నారు.
● వేములవాడ జడ్జి జ్యోతిర్మయి
Comments
Please login to add a commentAdd a comment