ప్రణాళికతో ముందుకెళ్తాం
● పారిశుధ్యం లోపించకుండా చర్యలు ● మహాశివరాత్రికి ప్రత్యేక ప్రణాళిక ● వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్
వేములవాడఅర్బన్: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో నిర్వహించే జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పారిశుధ్యం లోపించకుండా ప్రణాళికతో ముందుకెళ్తామని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తెలిపారు. వేములవాడ మున్సిపల్‌తోపాటు ఇతర మున్సిపాలిటీల్లోని సిబ్బంది, అధికారులకు కూడా మహా శివరాత్రి విధులు కేటాయించినట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర ఈనెల 25, 26, 27 తేదీల్లో జరుగనుండగా మున్సిపల్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నాం. పట్టణంలోని రహదారులను కూడా శుభ్రం చేయిస్తాం. మహాశివరాత్రి వేడుకలకు ఆలయం, పట్టణంలోని జాతరగ్రౌండ్ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తాం. పారిశుధ్య సిబ్బంది వసతి కోసం సినారె కళామందిర్ తీసుకున్నాం. పట్టణంలోని వీధుల్లో ఏర్పాటు చేసేందుకు 185 లైట్లు తెప్పించాం.
డంపింగ్‌యార్డుకు తరలింపు
మహాశివరాత్రి జాతరలోని చెత్తను వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లోని డంపింగ్‌యార్డుకు తరలిస్తాం. వేములవాడ మున్సిపల్ నుంచి చెత్త ఆటోలు 20, ట్రాక్టర్లు, ఇతర మున్సిపల్ నుంచి 8 ట్రాక్టర్లు, మరో నాలుగు ట్రాక్టర్లను ఎంగేజ్ తీసుకుంటున్నాం. చెత్తసేకరణకు 60 డ్రంబులు ఏర్పాటు చేస్తాం. రద్దీ ప్రాంతాల్లో ప్రతీ 30 మీటర్ల దూరంలో ఒక డస్ట్‌బిన్ ఏర్పాటు చేస్తాం. చెత్త సేకరణ ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల వరకు కొనసాగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తాం.
505 మంది పారిశుధ్య సిబ్బంది
వేములవాడ మున్సిపల్ నుంచి 101 మంది పారిశుధ్య సిబ్బందితోపాటు ఇతర మున్సిపాలిటీలు సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, హుజూరాబాద్, రామగుండం, పెద్దపల్లి, సుల్తాన్‌బాద్ నుంచి శానిటేషన్ సిబ్బందిని రప్పిస్తున్నాం. పారిశుధ్య సిబ్బందిని 22 జోన్‌లుగా విభజించి.. 35 రూట్‌లను ఏర్పాటు చేశాం. ఒక్కో రూట్‌కు 3 షిఫ్ట్ట్‌లు, షిఫ్టున్టకు ఆరుగురు సిబ్బందిని కేటాయించాం. ఎక్కువ చెత్త ఉత్పత్తి అయ్యే జాతరగ్రౌండ్, గాజులబజార్, బద్దిపోచమ్మ ఏరియా, పార్వతీపురం, భీమేశ్వరసదన్, టాకీస్ రోడ్డులో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఈ ప్రాంతంలో చెత్తను వెంట వెంటనే తరలిస్తాం.
ప్రత్యేక చర్యలు
ప్రణాళికతో ముందుకెళ్తాం
Comments
Please login to add a commentAdd a comment