కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
● ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్
వేములవాడఅర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ అన్నారు. ఆదివారం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ కన్వేక్షన్ హాల్‌లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించగా, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థి పెట్టకుండా బీజేపీకి మద్దతు ఇస్తుందన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ, ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకొని పార్టీ గెలుపుకోసం కృషి చేయాలన్నారు. సోమవారం కరీంనగర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని, సభలో పట్టభద్రులు అందరూ పాల్గొనాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో చాల మార్పులు తీసుకువచ్చామని, పదేళ్లలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగిందన్నారు. కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment