టీటీఎఫ్ జిల్లా కార్యవర్గం
సిరిసిల్లఎడ్యుకేషన్: ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అజ్మీర మదన్‌లాల్‌నాయక్, ప్రధాన కార్యదర్శి బిక్కునాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత లక్ష్మణ్ నాయక్, నాయకులు శర్మన్‌నాయక్ హాజరై మాట్లాడారు. గిరిజన ఉపాధ్యాయుల సర్వీసు, విద్యాపరమైన సమస్యల పరిష్కారానికి పోరాడే బహుజన ఎజెండా కలిగిన సంఘం తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ అని అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న అడక్వసి పదాన్ని తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 29 రద్దు చేయాలని కోరారు. నూతన కార్యవర్గంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నునావత రాజు, జిల్లా సహ అధ్యక్షుడు బదనపురం రవి, జిల్లా కోశాధికారి భూక్య రాజు, మహిళా అధ్యక్షురాలు భూక్య శైలజ, ప్రధాన కార్యదర్శి కంది శిరీష, ఉపాధ్యక్షులు భూక్య తారాచంద్, లాకావత్ బన్నాజీ, ఇస్లావత్ భూపతి, భూక్య రమేశ్, నునవత్ సునీత, కార్యదర్శులు భూక్య రూప్‌సింగ్, అజ్మీర రఘుపతి, లాకావత్ రవి, గుగులోతు బాబు, భూక్యా మంజుల, ప్రచార కార్యదర్శి భూక్య సతీశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment