స్వీపర్లు, స్కావెంజర్లను ఆదుకోవాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లను సర్కార్ ఆదుకోవాలని స్వీపర్లు, స్కావేంజర్ల సంఘం జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం గంభీరావుపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏడు నెలలుగా స్వీపర్లు, స్కావెంజర్ల వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. నెలకు రూ.20వేల వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సమావేశంలో సునీత, దేవయ్య, లచ్చవ్వ, వనిత, వెంకటేశ్, దేవయ్య, మల్లయ్య, రజిత, లత, నర్సవ్వ, రాజేశ్వరి, కొమురవ్వ, మల్లవ్వ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment