ఒబేసిటీని ఓడిద్దాం
సిరిసిల్ల: స్థూలకాయంతో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగుమల్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రపంచ స్థూలకాయ(ఒబేసిటీ) దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థూలకాయం మూలంగా డయాబెటీస్, బీపీ, కీళ్లనొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్ర జల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. మితంగా తింటూ, నిత్య వ్యా యామంతో ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పి.లీలా శిరీష మాట్లాడుతూ, స్థూలకాయంతో మహిళల్లో అనేక సమస్యలు ఉంటాయని, వ్యా యామం చేస్తూ ఒబేసిటీకి దూరంగా ఉండాలన్నారు. ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ అభినయ్, వైద్యులు ఎం.మధు, సాయి, రంజిత్, మురళీధర్‌రావు, శోభారాణి, పత్తిపాక అరుణ, మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
8న జాబ్ మేళా
సిరిసిల్లకల్చరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రిక్రూట్‌మెంట్ హెడ్ వినయ్ తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ శాఖల్లో ఖాళీగా ఉన్న బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. స్థానిక వాసవీనగర్‌లోని మహతి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే మేళ్లాకు డిగ్రీ ఉత్తీర్ణులై 30 ఏళ్ల లోపు వయసు గల మహిళలు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఎంపికై న మహిళలకు శిక్షణనిచ్చి నియామకాలు జరుపుతామని, ఏడాదికి రూ.2.25 లక్షల నుంచి 2.8లక్షల ప్యాకేజీ లభిస్తుందన్నారు. అర్హత, ఆసక్తి గలవారు విద్యార్హతల ధృవపత్రాల జిరాక్స్ ప్రతులు, ఆధార్‌కార్డుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 81067 64653, 98855 35991 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
బీజేపీ సంబరాలు
సిరిసిల్లటౌన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలవడంపై కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బర్కం లక్ష్మీయాదవ్, నాగుల శ్రీనివాస్, బొల్గం నాగరాజుగౌడ్, రాజాసింగ్, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేపు హుండీ లెక్కింపు
వేములవాడ: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్నకు హుండీలలో వేసిన కట్నాలు, కానుకల లెక్కింపును ఈనెల 6న ఉ దయం 8 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరుకావాలని ఉత్తర్వులు వెలువరించారు.
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. మంగళవారం కార్మికులతో కలిసి సిరిసిల్ల మున్సిపల్ ఎదుట ధర్నా చేపట్టి మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు అందించాలని, పీఎఫ్, పీఆర్‌సీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారం లోపు సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులందరూ పనులు బంద్ చేసి సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సుల్తాన్ నర్సయ్య, కాసారపు శంకర్, రాజయ్య, బాలయ్య, దేవరాజు, భారతవ్వ, బాబా కిషన్, లక్ష్మి, నర్సవ్వ, మల్లేశం, దేవయ్య, సురేశ్, శ్రీనివాస్, నరేశ్, రాజు, మమత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఒబేసిటీని ఓడిద్దాం
Comments
Please login to add a commentAdd a comment