ఎల్లారెడ్డిపేటకు నీటిని తరలిస్తాం
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువులకు నీటిని తరలిస్తామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మంగళవారం మల్కపేట రిజ ర్వాయర్‌ను సందర్శించారు. రిజర్వాయర్‌లో నీటి నిల్వపై నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్‌రెడ్డిని ఆరా తీయగా, మంగళవారం నాటికి 0.75 టీఎంసీల డెడ్ స్టోరేజ్ నీరు నిల్వ ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బోయినపల్లి మండలం మిడ్‌మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌కు 0.5 టీఎంసీల నీటి విడుదలకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈ సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు ఉన్నారు. కాగా మిడ్‌మానేరు నుంచి నీటి పంపింగ్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం మొదలైంది. నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడారు. రోజుకు 0.1 టీఎంసీ చొప్పున 5 రోజుల పాటు పంపింగ్ కొనసానుంది.
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఎలారెడ్డిపేట(సిరిసిల్ల): మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి నీటివిడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి దృష్టికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి తీసుకుపోవడంతో నీటిని విడుదల చేసినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. కాగా నీటి విడుదల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడారు. నీటి విడుదలతో రైతులు సంతోషంగా ఉన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా
ఎల్లారెడ్డిపేటకు నీటిని తరలిస్తాం
Comments
Please login to add a commentAdd a comment