మల్కపేటకు మధ్యమా‘నీరు’
● కేటీఆర్ డిమాండ్‌తో కదిలిన యంత్రాంగం
సిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం దేవుడిగుట్ట తండాలో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతుల బాధలు విన్న కేటీఆర్ 48 గంటల్లో మధ్యమానేరు నుంచి మల్కపేటకు నీటిని పంపింగ్ చేసి, మల్కపేట నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మల్కపేట పంపుహౌజ్‌ను సందర్శించి నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. మధ్యమానేరు నుంచి 0.5 టీఎంసీ నీటిని పంపింగ్ చేసి ఎల్లారెడ్డిపేట మండలం మైసమ్మ చెరువు, గంభీరావుపేట మండలం సింగసముద్రంకు కాల్వ ద్వారా పంపించనున్నారు. ఇప్పటికే కాల్వల్లోని మట్టిని తొలగించి శుభ్రం చేయించారు. కేటీఆర్ 48 గంటల గడువు విధించడంతోనే మల్కపేటకు మధ్యమానేరు నీటి పంపింగ్ మొదలైందని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటుండగా.. ప్రభుత్వమే రైతుల పొలాలను కాపాడేందుకు ముందుకు వచ్చి నీటిని విడుదల చేసిందని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎండిన పొలాలకు సాగు నీరు చేరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment