భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు
సిరిసిల్లటౌన్: భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘ్ జిల్లా అధ్యక్షుడు పులి లక్ష్మీపతిగౌడ్ ఆధ్వర్యంలో భగవాన్ బలరాం చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. భారతీయ కిసాన్ సంఘ్ నిరంతరం రైతుల పక్షాన ఉంటూ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విద్యుత్, యూరియా సరఫరా చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి బియాంకార్ శ్రీని వాస్, సభ్యులు చిప్ప దేవదాస్, గణేశ్, శ్రీ రాములు, సారయ్య, పోశెట్టి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment