పదేళ్లలో చుక్క నీరివ్వలేదు
● ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ● బీఆర్‌ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క గ్రామానికి కూడా చుక్క నీరివ్వలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌ను బుధవారం సందర్శించారు. మిడ్‌మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లో చేరుతున్న నీటిని పరిశీ లించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ ఇంకా రైతులను మభ్యపెట్టాలని చెబుతున్న అభూత కల్పన కథలను మానుకోవాలని హితవు పలికారు. మీ పదేళ్లలో మల్కపేట రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల పరిధిలోని అల్మాస్‌పూర్ కాలువ వరకు ఒక్క గ్రామానికై నా చుక్క నీరు తీసుకెళ్లారా.. అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. పొలాలు ఎండిపోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడితే నీళ్లు కాల్వల ద్వారా వస్తున్నాయని స్పష్టం చేశారు. కేటీఆర్ రైతులపై కపట ప్రేమ ప్రదర్శించడం మానుకోవాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గంలో లేని కాలువను ఎండకొడుతున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని కాల్వల్లో నీరు వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment