మహిళా చట్టాలు తెలుసుకోవాలి
● ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి, లీగల్‌సెల్ సెక్రటరీ రాధికాజైశ్వాల్
సిరిసిల్లటౌన్: మహిళా సంరక్షణకు గల చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సిరిసిల్ల సీనియర్ సివిల్‌జడ్జి, లీగల్‌సెల్ జిల్లా సెక్రటరీ రాధికాజైశ్వాల్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళా చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా మహిళా కా ర్మికులను సన్మానించి మెమొంటోలు అందజేశా రు. ఈనెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కమి షనర్ ఎస్.సమ్మయ్య, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, బార్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట్, న్యాయవాదులు ఆడెపు వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment