ఐసీడీఎస్ ఆఫీస్‌కు కొత్త బోర్డు
సిరిసిల్ల: వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ బోర్డుపై అక్షరాలు కనిపించకుండా పోయాయని, ఆఫీస్ బోర్డు మసకబారిపోయిందంటూ ‘ఇది ఏ ఆఫీస్’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమై న కథనానికి జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం స్పందించారు. ఎండలు, వర్షాలతో బోర్డు కనిపించడం లేదన్నారు. దాని స్థానంలో కొత్తబోర్డు ఏర్పాటు చేయాలని వేములవాడ ప్రా జెక్టు ఆఫీస్ అధికారులను ఆదేశించిన ట్లు లక్ష్మీరాజం వివరించారు. త్వరలో నే ఐసీడీఎస్ ఆఫీస్‌కు కొత్తబోర్డును అమర్చుతామని స్పష్టం చేశారు. ‘సాక్షి’ కథనంతో ఐడీసీఎస్ జిల్లా అధికారులు స్పందించి ఆదేశాలు జారీ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment