పీఆర్ పోస్టుల్లో వీఆర్‌వోలను నియమించొద్దు
● జెడ్పీ సీఈవోకు పీఆర్ ఉద్యోగుల సంఘం వినతి
సిరిసిల్ల: మండల పరిషత్‌లోని పంచాయతీరాజ్ పోస్టుల్లో వీఆర్‌వోలకు అవకాశం కల్పించవద్దని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రావు కోరారు. ఈమేరకు జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం ఇచ్చారు. వేములవాడరూరల్, రుద్రంగి మండల పరిషత్‌లలో వీఆర్‌వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించకుండా.. సూపరిటెండెంట్ పోస్టుల్లో నియమించారని పేర్కొన్నారు. ఈ విధానంతో పంచాయతీరాజ్‌శాఖలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారులు, సిబ్బందిని సన్మానించారు. పీఆర్ ఉద్యోగుల సంఘం నాయకులు రాజిరెడ్డి, రమణ, రమేశ్, పాపారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment