స్కానింగ్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
సిరిసిల్ల: స్కానింగ్ సెంటర్లలో చేసే స్కానింగ్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రోగ్రాం ఆఫీసర్, హెచ్‌ఎన్ ఇన్‌చార్జి సంపత్‌కుమార్ కోరారు. కుటుంబ ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాలతో సిరిసిల్లలోని పలు స్కానింగ్ సెంట ర్లను శుక్రవారం తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం(పీసీపీఎన్‌డీటీ) ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సంపత్‌కుమార్ మాట్లాడుతూ స్కానింగ్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ నమోదు చేయాలన్నారు. డిప్యూటీ డెమో డాక్టర్ రాజ్‌కుమార్, డీహెచ్‌ఈడబ్ల్యూ రోజా, పోలీస్ కానిస్టేబుల్ శ్రీలత, హెచ్‌ఈ బాలయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మహేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment