సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగసముద్రం నాలా(పెద్ద కాలువ) ఆయకట్టు భూములకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, నాయకులు శుక్రవారం రోడ్డెక్కారు. సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరందక పొలాలు ఎండిపోతున్నాయని, పశువులకు తాగునీరు కూడా అందడం లేదని రైతులు వాపోయారు. నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ద్వారా పెద్ద కాలువకు నీరు విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని కోరారు. వీరి ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఆఫీస్ సబార్డినేట్ సస్పెన్షన్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని గాలిపెల్లి పశువైద్య కేంద్రం ఆఫీస్ సబార్డినేట్ కె.దేవమ్మను శుక్రవారం సస్పెండ్ చేస్తూ జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దేవమ్మ గతేడాది జూన్‌లో ముందస్తు రిటైర్మెంట్ కోసం మెడికల్ సర్టిఫికెట్లతో జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. లివర్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు మెడికల్ సర్టిఫికెట్లు జతపరిచింది. దీనిపై జిల్లా అధికారులు విచారించగా దేవమ్మ దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్స్ మోసపూరితమైనవని తేలింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పశువైద్యాధికారి దేవమ్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment