నిరుద్యోగుల ఉపాధికి కార్యాచరణ
● ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్కిల్ కమిటీ సమావేశం జరిగింది. నిరుద్యోగులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. కలెక్టర్ చైర్మన్‌గా 16 మంది జిల్లా స్థాయి అధికారులతో కూడిన జిల్లా స్థాయి స్కిల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. భవన నిర్మాణం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలను జిల్లా యువతకు వివరిస్తూ ఉపాధి కల్పనకు ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు.
పెన్షన్లు రుణాలకు జమచేస్తే క్రిమినల్ కేసు
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక పింఛన్లను కొన్ని బ్యాంకులు రుణాల కింద జమ చేసుకుంటున్నట్లు తెలిసిందని, పెన్షన్లను రుణాల కిందికి జమ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. రూ.1,519కోట్లు పంట రుణాలు లక్ష్యం కాగా.. డిసెంబరు నాటికి రూ.808కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఈనెలాఖరిలోగా పరిష్కరించాలని సూచించారు. 42,942 దరఖాస్తులు 2020లో రాగా 23,515 ఆమోదించామని, 1,230 తిరస్కరించినట్లు తెలిపారు. అధికారుల బృందం దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉన్న వాటిని పరిష్కరించాలన్నారు. సమావేశాల్లో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, డీఆర్‌డీవో శేషాద్రి, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీఏవో అఫ్జల్ బేగం, ఎల్‌డీఎం మల్లికార్జున్, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు జనార్దన్, రాజమనోహర్, లీడ్ బ్యాంకు మేనేజర్ టీఎన్ మల్లికార్జున్‌రావు, యూబీఐ రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి, ఆర్‌బీఐ ఎల్‌డీవోవీ సాయితేజ్‌రెడ్డి, డీటీసీపీ అన్సార్, కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment