స్నేక్.. షేక్
కరీంనగర్‌రూరల్: సాధారణంగా మహిళలు బల్లి కనిపిస్తేనే అమ్మో అంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా పాములు పట్టడమే వృత్తిగా ఎంచుకుంది. కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన షేక్ సయిదా భర్త ఖాజామియా 15ఏళ్లక్రితం డెంగీతో చనిపోయాడు. కుటుంబపోషణ కోసం పాములు పడుతోంది. చిన్నప్పుడు తండ్రి సయ్యద్‌బాబా వద్ద నేర్చుకున్న పాములను పట్టడమే వృత్తిగా మార్చుకుంది. తమ ప్రాంతంలో పాము వచ్చిందని ఎవరైనా ఫోన్‌చేస్తే రాత్రి పగలు లేకుండా అక్కడికి చేరుకుంటోంది. పాములు పట్టినందుకు వారు ఇచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పట్టుకున్న పాములను అటవీ శాఖ అధికారులకు అప్పగించడం, లేదా అటవీప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తోంది. సయిదా ప్రస్తుతం అద్దెఇంట్లో ఉంటోంది. పాముకాటుకు గురైతే తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదనవ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఆదుకునేందుకు సాయం చేయాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment