
సమస్యలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ప్రజావాణిలో 155 అర్జీల స్వీకరణ
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్ పెట్టవద్దని సూచించారు. మొత్తం 155 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ 51, సిరిసిల్ల మున్సిపల్ 9, డీఆర్డీఏకు 36, వేములవాడ మున్సిపల్ కమిషనర్‌కు 4, హౌసింగ్‌శాఖకు 14, ఉపాధి కల్పన శాఖకు 8, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌కు 1, పంచాయతీరాజ్ శాఖకు 15, విద్యాశాఖకు 12, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్, ఎస్పీ ఆఫీస్, ఎస్‌డీసీకి ఒకటి చొప్పున, జిల్లా వైద్యాధికారికి 2 అర్జీలు వచ్చాయి. డీఆర్డీవో శేషాద్రి పాల్గొన్నారు.