
భ్రూణహత్యల విచారణలో పురోగతి
చందుర్తి (వేములవాడ): భ్రూణహత్యల విచారణలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం పురోగతి సాధించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపిన వివరాలు. చందుర్తి మండలంలో జరిగిన భ్రూతహత్యలపై రెండు రోజులుగా కొనసాగుతున్న విచారణలో బాధితురాలు ఇచ్చిన సమాచారంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆ ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయనున్నట్లు డీఎంహెచ్‌వో రజిత తెలిపారు.
సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారం
● ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్
సిరిసిల్ల: సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారమవుతాయని ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. స్థానిక నెహ్రూనగర్‌లో బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మైండ్‌కేర్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడు భార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారం కోసం మైండ్‌కేర్ సెంటర్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే వివాదాలకు తావే ఉండదన్నారు. మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, వేముల అన్నపూర్ణ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కిమ్స్ కళాశాల విద్యార్థులు జి.పద్మ, జి.పూజిత, వి.సుస్మిత, నాగుల వందన, జె.అనుపమ అంజనీ, డి.మానస పాల్గొన్నారు.
జ్యువెల్లరీ షాపులకు అనుమతులు ఇవ్వొద్దు
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముస్తాబాద్‌లో జ్యువెల్లరీ దుకాణాల ఏర్పాటుపై స్వర్ణకారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన చేశారు. స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు పెడుతుండడంతో స్థానికులకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల బంగారం దుకాణాల ఏర్పాటకు ముస్తాబాద్ మండలంలో అనుమతులు ఇవ్వరాదని తహసీల్దార్ సురేశ్, ఎస్సై గణేశ్, ఈవో రమేశ్‌లకు ఫిర్యాదు చేశారు. స్వర్ణకారులు సంఘం నాయకులు విశ్వనాథం, ఈశ్వరయ్య, అనిల్, సతీశ్, చేపూరి రవి, శ్రీనివాస్, సాయిలక్ష్మణ్, సంతోష్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

భ్రూణహత్యల విచారణలో పురోగతి

భ్రూణహత్యల విచారణలో పురోగతి