
వేములవాడలో మరోసారి కొలతలు
వేములవాడ: పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా అధికారులు గురువారం మరోసారి కొలతలు తీసుకున్నారు. నిర్వాసితుల తుది జాబితాను ఖరారు ఏచసేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, అటవీశాఖ అధికారులతో కూడిన నాలుగు బృందాలు 24 మంది అధికారులు అంచనాలు వేశారు. గతంలో మూడుసార్లు కొలతలు వేసిన విషయం తెలిసిందే. అయితే మూలవాగు బ్రిడ్రి నుంచి రాజన్న ఆలయం వరకు మొదటి దఫాలో 80 ఫీట్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.47కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. అంతా సజావుగా సాగితే ఏళ్లుగా ఎదురుగా చూస్తున్న రోడ్డు విస్తరణకు మోక్షం లభించనుంది.