
నేడు బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతల సమావేశం
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంటలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. చింతకుంటలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని శుక్రవారం మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులతో కలిసి సందర్శించారు. పార్టీ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.సింగిల్ విండో చైర్మన్ వీర్ల వేంకటేశ్వర్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.