
ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగి● రూ.7వేలు తీసుకుంటూ పట్
జగిత్యాల: కలెక్టరేట్ సముదాయంలోని ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు జరిగాయి. రూ.7వేల లంచం తీసుకుంటూ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ అరిగె రఘుకుమార్ పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓ ప్రభుత్వశాఖలో పనిచేసే ఉద్యోగి లోను కోసం కంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.1.04 లక్షలు మంజూరు కాగా.. చెల్లించడం సైతం జరిగింది. అయితే ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అరిగె రఘుకుమార్ ఆ వ్యక్తికి తరుచూ ఫోన్ చేసి రూ.7 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం 11గంటలకు డబ్బులు ఇస్తానని రఘుతో చెప్పాడు. ఉదయం 10 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. సదరు ఉద్యోగి నుంచి రఘుకుమార్ తన కార్యాలయంలో రూ.7వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కరీంనగర్ తరలించారు.
యువకుడిపై పోక్సో కేసు
ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు నవదీప్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు. గ్రామాని కి చెందిన దంపతులు తమ చిన్నారిని ఇంటి వ ద్ద వదిలి పనులకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు.. అత్యాచారానికి యత్నించగా భయపడి ఇంటికి పరుగులు తీసింది. తల్లిదండ్రులు వ చ్చాక విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై గ్రామంలో శుక్రవారం విచారణ జరిపా రు. నిందితుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.