
రైతుల సంక్షేమమే ధ్యేయం
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని అనంతపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్‌కుమార ఝాతో కలిసి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తోందని రైతులు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. అనంతరం గ్రామంలోని ఇందిర మ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంఏవో ప్రణిత, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, పార్టీ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, జంగం అంజయ్య, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, జంగ సత్యం, సంబ లక్ష్మి రాజం, ఏనుగుల కనుకయ్య పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి కోరారు. మండలంలోని రాంరెడ్డిపల్లి, కొండాపూర్, రామలక్ష్మ ణపల్లి, ఆవునూర్, తుర్కపల్లి గ్రామాల్లో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ పాదయాత్రను శనివారం చేపట్టారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేశారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేల కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో బుద్ది చెప్పారన్నారు. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్‌తోపాటు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, పాదయాత్ర ఇన్‌చార్జి నాగం కుమార్, సింగిల్‌విండో చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, బొందుగుల దేవిరెడ్డి, రాజు, సిద్దారెడ్డి, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు.
తహసీల్దార్ ఆఫీస్‌లో బదిలీ ఉద్యోగి
బోయినపల్లి(చొప్పదండి): స్థానిక తహసీల్దార్ ఆఫీస్‌లో ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ ఉద్యోగి సెలవు రోజైన శనివారం ప్రత్యక్షమవడం చర్చకు దారితీసింది. సదరు ఉద్యోగిని బదిలీ చేయాలని పలువురు నాయకులు ఇటీవల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బోయినపల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ మరుసటి రోజే ఆ ఉద్యోగిని బదిలీ చేశారు. సదరు ఉద్యోగి స్థానంలో మరొకరు చార్జీ తీసుకున్నారు. అయితే శనివారం ఆఫీస్‌కు ఎందుకు వచ్చాడనే చర్చ మండల కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంపై తహసీల్దార్ నారాయణరెడ్డిని వివరణ కోరగా బీరువా తాళాలు ఇచ్చి వెళ్లినట్లు తెలిపారు.
విద్యార్థిని చితకబాదిన టీచర్‌పై ఫిర్యాదు
గంభీరావుపేట(సిరిసిల్ల): తన కొడుకును టీచర్ కొట్టాడని ఓ తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాలు. గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్యాసంస్థలోని ప్రైమరీ స్కూల్ టీచర్ అదే స్కూల్‌లో చదివే ఓ విద్యార్థిని చితకబాదాడు. ఒకటో తరగతి చదువుతున్న లవన్‌సాయిని టీచర్ దేవరాజు కొట్టాడని విద్యార్థిని తల్లి జ్యోతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రైతుల సంక్షేమమే ధ్యేయం

రైతుల సంక్షేమమే ధ్యేయం